కొడుకు తల్లి గురించి చెప్పిన మాటలు కి షాక్ అయిన తండ్రి....


ఒక బాబు తల్లి చనిపోంది కానీ వాళ్ల నాన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు..
ఒక రోజు వాళ్ల నాన్న ఆ అబ్బాయిని ఒరే నీకు కొత్త అమ్మ ..చనిపోయిన అమ్మ మధ్య ఏం తేడా కనిపించింది ....అని అడిగాడు....
అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు.....
కొత్త అమ్మ నిజం..చనిపోయిన అమ్మ అబద్ధం అని అన్నాడు....
ఆ మాట విన్న తండ్రి అవాకై .....ఎందుకురా అన్నాడు....
అప్పుడు ఆ అబ్బాయి ఇలా అన్నాడు...
నేనెప్పుడూ అల్లరి చేసిన అప్పుడు మా అమ్మ అనేది...
నువ్వు అల్లరి చేస్తే నీకు అన్నం పెట్టను అనేది....
కానీ నేను అల్లరి చేసిన ...తన వళ్ళో కూర్చో పెట్టుకొని అన్నం తినిపించేది....
కానీ ఇప్పుడు ఉన్న కొత్త అమ్మ కూడా అల్లరి చేస్తే అన్నం పెట్టను అంది...
కానీ ఈ కొత్త అమ్మ నిజం గానే 3 రోజుల నుంచి అన్నం  పెట్టడం లేదు....
అందుకే మా అమ్మ అబద్ధం.... ఈ కొత్త అమ్మ నిజం...
అన్నాడు...ఇది విన్న నాన నోటిలో నుంచి మాట రాలేదు..

Comments