పైసా కూడా లేదు కానీ ఫ్లైట్ ఎక్కరు అదృష్టం అంతే ఇదినేమొ......

ఆగస్టు 8,
సమయం : ఉదయం 6గంటల 30 నిమిషాలు…

నిరక్షరాస్యలైన తల్లి, తన కూతురిని వెంటబెట్టుకొని చెన్నై లోని అన్నా యూనివర్సిటికి వచ్చింది. 8: 30 లకు వాళ్ళ అమ్మాయికి B.SC అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి కౌన్సెలింగ్ ఉంది. వాస్తవానికి  వాళ్లు అక్కడికి దగ్గర్లోని గ్రామం నుండి కౌన్సెలింగ్ కు ఎడ్ల బండి మీద వచ్చారు. అంతటి పేదరికం వాళ్లది.
కానీ కౌన్సలింగ్ జరిగేది అన్నా యూనివర్సిటిలో కాదు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కొయంబత్తూర్ లో.. తెలిసిన వాళ్ళు మిస్ గైడ్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చారు. ఎం చేయాలో తోచట్లేదు… ఎవరిని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి వారిది. ఇంతలో అటుగా వాకర్లు వాళ్లను చూసి, అసలు విషయం ఏంటి అని ఆరా తీశారు…????

విషయం తెలుసుకున్న వాకర్లు… అగ్రికల్చర్ యూనివర్సిటి కొయంబత్తూర్ లో ఉంది, మీరున్నది చెన్నైలో.. చెన్నై కు కొయంబత్తూర్ కు దాదాపు 500 కిలో మీటర్ల దూరం.. అందులో ఇప్పుడు టైమ్ 7 అవుతుంది , మీ కౌన్సెలింగ్ ఏమో.. 8: 30 అంటున్నారు… కానీ జర్నీ చేయాలంటే మినిమమ్ 7 హవర్స్ పడుతోంది… అని చెప్పారు.


ఇక్కడే   కీలక   మలుపు :

ఒక్క సారి అమ్మాయి చదువు విషయాన్ని ఆరా తీశారు అక్కడి వాకర్స్.. ఇంటర్మీడియట్ లో 1200 లకు గాను 1017 మార్కులు సాధించింది ఆ అమ్మాయి, అది కూడా ఫుల్ పీవర్ లో ఎగ్జామ్ రాసి, మారుమూల ఊరు నుండి.. దీంతో చలించిపోయిన వాకర్స్ తమ ఫోన్లకు పని చెప్పారు…
ఒకాయన… అమ్మకు, అమ్మాయికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు, ఇంకోకాయనకు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాగా పరిచయం ఉన్న వ్యక్తి కావడం వల్ల.. రిజిస్ట్రార్ కు ఫోన్ చేసి ఈ అమ్మాయి గురించి చెప్పాడు కౌన్సెలింగ్ కు కాస్త లేటు గా వస్తుందని….. ఆ అమ్మా, అమ్మాయిల వద్దకు కార్ వచ్చింది.. చెన్నై ఏయిర్ పోర్ట్ లో దించింది… చెన్నై నుండి కొయంబత్తూర్ కు వెళ్లే ఫ్లైట్ లో వాళ్లు 10.05 కు ఎక్కారు. 11.40 కి అక్కడ దిగారు. దిగగానే అక్కడికి ఇంకో కార్ వచ్చింది… అటు నుండి తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో దించారు వారిద్దరిని.అమ్మా, ఆ అమ్మాయిలిద్దరూ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరే సరికొ 12.15 అయ్యింది .. 2 వరకు కౌన్సెలింగ్ అయిపోయింది ఆ అమ్మాయికి BSC (BIO -TECH ) లో సీట్ వచ్చేసింది. ఇది అత్బుతం అంటే . …. ఫ్లైట్ టికెట్స్ ఇప్పించిన వ్యక్తి, కార్లను ఎరేంజ్ చేసిన వ్యక్తి, రిజిస్ట్రార్ తో మాట్లాడిన వ్యక్తి, ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తులు ఇలా ప్రతి ఒక్కరు……ఆమెకు జీవితంతం గుర్తుంటారు..

Comments

  1. Top 10 Casinos in USA (2021) - Live Dealer Casino Sites
    Best live dealer casino games online 숫자 야구 필승법 ✓ Get list of best casinos with real money casino 슬롯사이트 games in USA. Learn 해외 축구 스코어 about real money bonuses, casino games, 게임 종류 live 업소 사이트

    ReplyDelete
  2. What is the difference between the Borgata and Casino? - Dr. Dr.
    What does 여수 출장마사지 the Borgata and Casino mean? 김천 출장샵 If you can only 울산광역 출장안마 visit the Borgata and Casino, then 창원 출장마사지 the casino is the 상주 출장마사지 first place to go.

    ReplyDelete

Post a Comment